Fri Dec 05 2025 15:39:35 GMT+0000 (Coordinated Universal Time)
హైడ్రా సీరియస్ యాక్షన్
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖఅధికారులను కోరింది

హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కోరింది. ప్రధానంగా చెరువు, నాలా ఉన్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై యాక్షన్ తీసుకోవాలని సూచించింది. అడ్డగోలు అనుమతిచ్చిన అధికారులను వదిలిపెట్టవద్దని కోరింది.
చెరువును ఆక్రమించి...
గండిపేట, మాదాపూర్ పరిసరాలల్లో చెరువులను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టారని, కేవలం భవన యజమానులకే కాకుండా ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమించాలంటూ హైడ్రా ఆదేశించడంతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది.
Next Story

